• Jul 27, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత టీ20 జట్టు నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడనుంది. జపాన్‌లో సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జరిగే ఈ గేమ్స్‌లో పాల్గొనే పురుషులు, మహిళల క్రికెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌తో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ కూడా క్వార్టర్స్‌లో ఆడనున్నాయి. ఇక తొలి రౌండ్‌లో అఫ్ఘాన్‌, హాంకాంగ్‌, జపాన్‌, మలేసియా, నేపాల్‌, ఒమన్‌ జట్లు రెండు గ్రూపుల్లో నాకౌట్‌ బెర్త్‌ల కోసం తలపడతాయి. ప్రతిగ్రూప్‌ నుంచి టాప్‌-2 జట్లు క్వార్టర్స్‌కు వెళతాయి. సెప్టెంబరు 28న భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అటు మహిళల టోర్నీ నేరుగా క్వార్టర్స్‌ నుంచే ఆరంభం కానుంది. హర్మన్‌ సేన తొలి మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. 2023లో జరిగిన గేమ్స్‌లో మహిళల క్రికెట్‌లోనూ భారత్‌ విజేతగా నిలిచింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement