నెల్లూరులో వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్ ఉద్యోగుల బ్లాక్ బ్యాడ్జ్ నిరసన
నెల్లూరు:
ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు దశలవారీ ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దశలవారీ శాంతియుత ఉద్యమంలో భాగంగా రెండో దశ ఆందోళనను చేపడుతున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో తక్షణ రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ జీతం, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మరియు ఉద్యోగం, ఈపీఎఫ్–చెల్లింపు సెలవులు–హెల్త్ కార్డు, బదిలీల సౌకర్యం కల్పించాలనే డిమాండ్లు ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలోని మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఐక్యంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేర్కొంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.









Comments