నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం.. క్యాంప్ రాజకీయాలు షురూ
ఆంధ్రప్రదేశ్ : నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఈ నెల 18న ప్రవేశపెట్టనుండటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కార్పొరేటర్లను గోవాకు తరలించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 54 కార్పొరేటర్ స్థానాల్లో వైసీపీ గెలవగా తర్వాత మెజార్టీ సభ్యులు టీడీపీ లో చేరారు. తాజాగా ఐదుగురు తిరిగి వైసీపీ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 16కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అప్రమత్తమైంది.









Comments