పాక్-చైనాల సరిహద్దు కమిషన్‌ను తిరస్కరించిన భారత్
న్యూఢిల్లీ : పాకిస్థాన్-చైనా ఏర్పాటు చేసిన సరిహద్దు సంయుక్త కమిషన్‌ను భారత్ తిరస్కరించింది. ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలపై ఇలాంటి కమిషన్లు ఏర్పాటు చేసేందుకు పాకిస్థాన్‌కు ఎలాంటి చట్టపరమైన ప్రాతిపదిక లేదని తేల్చి చెప్పింది. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్-చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ తొలి సమావేశం జరిగిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. పాక్-చైనాల మధ్య సరిహద్దే లేదని, 1963లో శాక్స్‌గామ్ లోయకు సంబంధించి ఆ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.










Comments