పట్టు రైతులకు పెండింగ్ నిధులు విడుదల: అచ్చెన్న
అమరావతి : రాష్ట్రంలో పట్టు రైతులకు 2021-22 నుంచి పెండింగ్‌లో ఉన్న రాష్ట్రవాటా నిధుల్ని పూర్తి స్థాయిలో విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సిల్క్ సమగ్ర-2 పథకం కింద 2023-24, 2024-25 సంవత్సరాలకు పట్టు పరిశ్రమశాఖకు రాష్ట్ర వాటాగా రూ.14కోట్లు విడుదల చేయగా, రూ.13.75కోట్లు లబ్దిదారులకు నేరుగా చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13,663 మంది పట్టు రైతులు లబ్ది పొందారన్నారు.









Comments