పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్
పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో తెలంగాణ15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ మహారాష్ట్ర 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.









Comments