• Sep 21, 2026
  • NPN Log

    హైదరాబాద్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. కొండా బాపూజీ ఇంట్లోనే టీఆర్‌ఎస్ పుట్టిందని గుర్తుచేశారు. ఉద్యమాలే ఊపిరిగా... పోరాటాలే పరమావధిగా బ్రతికిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర మరువలేనిదన్నారు.

    కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే పుట్టిందని.. జలదృశ్యం సాక్షిగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని... వారి పేరును హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టుకుని గౌరవించిందన్నారు. నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.

    బాపూజీ అందరికీ స్ఫూర్తిదాయకం: హరీశ్ రావు

    కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. ‘పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే నాయకత్వమని తన ఆచరణతో చూపిన గొప్ప దార్శనికుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర్య సమరం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆయన జీవితమంతా ఒక నిరంతర పోరాటం. నాడు 1969 ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఆయన నిస్వార్థ త్యాగం, బడుగు బలహీన వర్గాలు, చేనేత కార్మికుల పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం. నేడు బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు’ అంటూ ఎక్స్‌లో హరీశ్ రావు పోస్ట్ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement