పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి : పోలీస్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్ష తేదీని త్వరలో APSLPRB ప్రకటించనుంది. దరఖాస్తును అధికారిక వెబ్సైట్ (https://slprb.ap.gov.in) ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.










Comments