• Sep 20, 2026
  • NPN Log

    టెహ్రాన్ : పశ్చిమాసియా ప్రాంతంపై అమెరికా ఆధిపత్యం ముగిసిపోయిందని, ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ దేశాలే నూతన వ్యవస్థను నిర్మించాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఖాలిబాఫ్ అన్నారు. ఇరాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, దేశంలోని రాజకీయ, ప్రముఖుల వర్గాల్లో ఉన్న 'రెండు వ్యూహాత్మక పొరపాట్లను' ఆయన ఎత్తిచూపారు.

    రెండు వ్యూహాత్మక పొరపాట్లు

    మొదటిది.. యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రణాళిక లేదా ముగింపు మెకానిజం లేకుండా డిప్లమసీని తిరస్కరిస్తూ సుదీర్ఘ యుద్ధంలోకి దేశాన్ని నెట్టే ధోరణి.

    రెండోది.. ఇరాన్ జాతీయ శక్తిని తక్కువగా అంచనా వేస్తూ, భయాందోళనలు సృష్టించి శత్రువుల ఏకపక్ష షరతులకు లొంగిపోవాలనే వైఖరి. ఈ రెండు ధోరణులు కూడా దేశీయ ఐక్యతను దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు.

    గత ఏడు నెలలుగా శత్రువులకు ఇరాన్ తగిన రీతిలో జవాబు ఇస్తోందని, అమెరికా ఆధిపత్యం కుప్పకూలిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసేన్ రెజాయ్ కూడా స్పందిస్తూ.. అమెరికాతో చర్చలు ప్రారంభించాలంటే ఇరాన్ విధించిన 7 షరతులను వాషింగ్టన్ అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు.

    అమెరికాతో దౌత్య సంబంధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సైనిక సింద్ధతను, వివేకవంతమైన వ్యూహాలను సమతుల్యం చేసుకుంటూ ముందుకెళ్తుందని ఖాలిబాఫ్ పునరుద్ఘాటించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement