పసిడి, వెండి ధరలు మరింత పైకి!
వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. గురువారం బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అమెరికా ఫెడ్ రేట్ కోత ఉంటుందన్న అంచనాలు బంగారం, వెండికి డిమాండ్ పెంచాయి. అయితే, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరలపై కొంత ఒత్తిడి కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం (డిసెంబర్ 19) ఉదయం 6.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,850కు చేరింది. నిన్న ఇదే సమయానికున్న రేటుతో పోలిస్తే రూ.330 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగి రూ.1,23,610కు చేరింది. వెండి ధరల్లోనూ ర్యాలీ కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,11,100గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధర సుమారు రూ.3 వేల మేర పెరిగింది.
అమెరికాలో నవంబర్ నెల ద్రవ్యోల్బణం తగ్గడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతపై మళ్లీ ఆశలు పుంజుకున్నాయి. దీంతో, క్రమంగా పసిడి, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, వెనెజువెలాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పారిశ్రామిక డిమాండ్‌లో వృద్ధి కూడా ధరలు పెరిగేలా చేస్తున్నాయి.
వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే) ఇలా
చెన్నై: ₹1,35,720; ₹1,24,410; ₹1,03,810
ముంబై: ₹1,34,850; ₹1,23,610; ₹1,01,140
న్యూఢిల్లీ: ₹1,35,000; ₹1,23,760; ₹1,01,290
కోల్‌కతా: ₹1,34,850; ₹1,23,610; ₹1,01,140
బెంగళూరు: ₹1,34,850; ₹1,23,610; ₹1,01,140
హైదరాబాద్: ₹1,34,850; ₹1,23,610; ₹1,01,140
విజయవాడ: ₹1,34,850; ₹1,23,610; ₹1,01,140
కేరళ: ₹1,34,850; ₹1,23,610; ₹1,01,140
పుణె: ₹1,34,850; ₹1,23,610; ₹1,01,140
వడోదరా: ₹1,34,900; ₹1,23,660; ₹1,01,190
అహ్మదాబాద్: ₹1,34,900; ₹1,23,660; ₹1,01,190
వెండి (కిలో) రేట్స్ ఇవీ
చెన్నై: ₹2,24,100
ముంబై: ₹2,11,100
న్యూఢిల్లీ: ₹2,11,100
కోల్‌కతా: ₹2,11,100
బెంగళూరు: ₹2,11,100
హైదరాబాద్: ₹2,24,100
విజయవాడ: ₹2,24,100
కేరళ: ₹2,24,100
పుణె: ₹2,11,100
వడోదరా: ₹2,11,100
అహ్మదాబాద్: ₹2,11,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.









Comments