పసి పిల్లల విక్రయ ముఠా అరెస్టు
ఆంధ్ర ప్రదేశ్: ఢిల్లీ, యూపీల నుంచి పసిపిల్లలను తెప్పించి విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులున్నారు. వీరి నుంచి ఐదుగురు శిశువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో శిశువును ₹3-₹5 లక్షలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. గతంలో ఇదే నేరంలో అరెస్టై బయటకొచ్చిన బండి సరోజ ఈ విక్రయాలు చేస్తున్నట్లు తేల్చారు. శిశువులను ICDS అధికారులకు అప్పగించారు.









Comments