బాడీవాష్ ఎలా వాడాలంటే?
స్నానం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. అయితే సబ్బుల కంటే బాడీవాష్‌లే చర్మానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. సబ్బును ఎక్కువగా వాడటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇలా కాకుండా బాడీవాష్‌ను లూఫా, స్పాంజి, వాష్‌క్లాత్, బాత్ గ్లోవ్స్‌పై వేసుకొని చర్మంపై గుండ్రంగా మసాజ్ చేస్తూ రుద్దుకోవాలి. దీనివల్ల చర్మం శుభ్రపడటంతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రెండు టేబుల్‌స్పూన్ల బాడీ వాష్ ఒంటికి సరిపోతుంది.










Comments