బిల్లుపై సంతకం పెట్టిన ట్రంప్.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు మార్గం సుగమం..
రష్యాపై కఠినమైన ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అదే సమయంలో రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే కొన్ని దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధించే అధికారాన్ని కూడా అమెరికా అధ్యక్షుడికి ఈ చట్టం కల్పిస్తోంది.
రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి. అందువల్ల ఈ రెండు దేశాలపై ఈ కొత్త చట్టం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ చట్టం ప్రకారం రష్యా నుంచి చమురు లేదా సహజ వాయువు కొనుగోలు చేసే కొన్ని ప్రధాన దేశాల దిగుమతులపై గరిష్ఠంగా 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారం ట్రంప్‌నకు దక్కింది. దీంతో భారత్ లేదా చైనా ఉత్పత్తులపై ఎంత శాతం సుంకాలు విధించాలనే నిర్ణయం ఇప్పుడు ట్రంప్ చేతుల్లోకి వెళ్లింది.
ఈ కొత్త చట్టాన్ని అమలు చేసి భారత్‌పై అధిక సుంకాలు విధిస్తే, అమెరికా మార్కెట్‌కు ఎగుమతి అవుతున్న భారతీయ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది . అయితే ఆ ప్రభావం ఎంత ఉంటుందనేది అమెరికా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయించే సుంకాల రేటు, ఏ ఉత్పత్తులపై వాటిని విధిస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఇప్పటికే ఈ పరిణామంపై స్పందించింది. దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.










Comments