భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం
ఆంధ్ర ప్రదేశ్ : నిర్మాణరంగం పుంజుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ప్రోత్సహించేలా నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పటివరకు భవనం 18 మీటర్లు దాటి ఎత్తు ఉంటే హైరైజ్ నిబంధనలు వర్తించేవి. దాన్ని 24 మీటర్లకు పెంచింది. స్థిరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో IGBC సిల్వర్, గోల్డ్, ప్లాటినం కేటగిరీల్లో ఉంటే నిర్మాణ అనుమతుల ఫీజులో వరుసగా 10, 15, 20 శాతం రాయితీని అందించనున్నారు.








Comments