మాజీ క్రికెటర్ల వైద్య ఖర్చులు రూ.15 లక్షలకు పెంపు
హైదరాబాద్ : మాజీ క్రికెటర్లకు బీసీసీఐ అందించే వైద్య ఖర్చుల సహాయ నిధిని రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచామని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వర్‌నాథ్ వెల్లడించారు. ఇటీవల ముంబైలో జరిగిన బోర్డు ఏజీఎంలో భారత క్రికెటర్ల సంఘం తరఫున తాను చేసిన ఈ ప్రతిపాదనను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు. పది లేదా అంతకంటే ఎక్కువ రంజీలాడిన మాజీ క్రికెటర్లకు ఇచ్చే ఈ వైద్య సహాయ నిధిని రూ. 15 లక్షలకు పెంచారు. ఇక, 25 అంతకంటే ఎక్కువ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన క్రికెటర్లకు రూ.30 వేలు నెలవారి ఫించన్ ఇవ్వాలని కూడా చాముండేశ్వర్‌నాథ్ ఏజీఎంలో ప్రతిపాదించారు. అయితే, దీనిపై త్వరలోనే మార్గదర్శకాలను రూపొందించనున్నారని చాముండి పేర్కొన్నారు.









Comments