మోదీజీ.. మీ రాజకీయ పరిజ్ఞానం అద్భుతం: పుతిన్
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు ‘ఎక్స్’లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీపై పుతిన్ పొగడ్తల వర్షం కురిపించారు. ‘మీతో(మోదీ) మాట్లాడటం నాకు ఎప్పుడూ సంతోషమే. మీ రాజకీయ తెలివి, ముందుచూపు అద్భుతం. అవి నన్నెంతగానో మెప్పించాయి. అలాగే, ఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో మీరు నన్ను సాదరంగా ఆహ్వానించారు. అంతర్జాతీయ వేదికపై మీకు ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తించాను’ అని పుతిన్ పేర్కొన్నారు. కాగా.. పుతిన్‌తో పాటు పలు దేశాల అధినేతలు కూడా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.










Comments