రిటైర్మెంట్‌కు ముందు జడ్జిల సిక్సులు: సీజేఐ
రిటైర్మెంట్‌కు ముందు జడ్జిలు భారీగా ఆర్డర్స్ ఇచ్చే ధోరణి పెరుగుతోందని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పదవీవిరమణకు 10 రోజుల ముందు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి(మధ్యప్రదేశ్) సస్పెండ్ అయ్యారు. 2 ఆర్డర్స్ విషయంలో ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో ఆ జడ్జి సుప్రీంను ఆశ్రయించారు. ‘పిటిషనర్(జడ్జి) పదవీ విరమణకు ముందు సిక్సర్లు కొట్టడం ప్రారంభించారు. ఇది దురదృష్టకరం. నేను దాని గురించి వివరించాలనుకోవట్లేదు’ అని CJI అన్నారు.









Comments