విద్యార్థుల ఆవేదనలో అర్థం ఉంది
న్యూఢిల్లీ : వరుస పేపర్ లీకేజీ ఘటనలకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థులకు స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనడపున్పడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగినదేనని ఉద్ఘాటించారు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశానిస్త్పహలకు గురవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. జీవితంలో వైఫల్యం అనేది సహజం అని, చీటింగ్ అనేది కూడదని, జీవితంలో పైకొచ్చేందుకు ఎప్పుడూ తప్పుడు దారులు (షార్ట్‌కట్స్) వెతకొద్దనే నైతిక సూత్రాన్ని తనకు చిన్నప్పుడే తండ్రి రమేశ్ టెండూల్కర్ నూరిపోశారని సచిన్ చెప్పారు. ఫలితాల కోసం తప్పుడు మార్గాలను వెతకడం మానేసి.. కష్టపడే తత్వానికి విలువనిచ్చే సంస్కృతిని పిల్లల్లో పెంపొందించే బాధ్యత సమాజంలో పెద్దలుగా మనందరిపైనా ఉందన్నారు.










Comments