• Apr 30, 2026
  • NPN Log

    మెదక్‌ : మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు వెయ్యిమంది రేవంత్‌లు అడ్డుపడినా ఆగదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆపే శక్తి ఉందా.. ఒకసారి ఆలోచించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. బుధవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన నారీ శక్తివందన్‌-నారీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గల్లీలో కూర్చొని సీఎం రేవంత్‌రెడ్డి బిల్లును, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు గుణపాఠం చెబుతారన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).