‘వారణాసి’లో మహేశ్ తండ్రిగా ప్రకాశ్ రాజ్?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘వారణాసి’ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. మహేశ్ తండ్రి పాత్ర కోసం ఆయనను తీసుకున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే ఈ పాత్ర కోసం ఇద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసినా జక్కన్న సంతృప్తి చెందలేదని సమాచారం. చివరగా ఈ పాత్రకు ప్రకాశ్ రాజ్ న్యాయం చేస్తారని దర్శకధీరుడు నమ్మడంతో ఆయన సెట్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.










Comments