విశాఖ కాగ్నిజెంట్లో 25000 మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
ఆంధ్రప్రదేశ్ : విశాఖలో నెలకొల్పుతున్న తమ సంస్థలో 25వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని IT సంస్థ కాగ్నిజెంట్ CEO రవికుమార్ వెల్లడించారు. విశాఖలో సంస్థను ఏర్పాటుచేయడం తన సొంత ఇంటికి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. కాగా సంస్థ 8వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ముందు ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అవకాశాల్ని పెంచింది. సంస్థ భవనాలకు సిఎం చంద్రబాబు శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో CEO దీన్ని ప్రకటించారు.









Comments