సైయెంట్ చేతికి అమెరికా కంపెనీ
హైదరాబాద్ : స్థానిక సైయెంట్ సెమీకండక్టర్స్ అమెరికా కేంద్రంగా పనిచేసే కైనెటిక్ టెక్నాలజీస్ కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం 9.3 కోట్ల డాలర్లు (సుమారు రూ.837 కోట్లు) చెల్లించనున్నట్టు తెలిపింది. దీంతో దాదాపు 4,000 కోట్ల డాలర్లకుపైగా ఉన్న పవర్ సెమీకండక్టర్స్ మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్ఠమవుతుందని తెలిపింది. పవర్ మేనేజ్మెంట్, హై పర్ఫార్మెన్స్ అనలాగ్, మిక్స్డ్ సిగ్నల్ ఐసీల్లో కైనెటిక్ టెక్నాలజీస్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పట్టుందని సైయెంట్ టెక్నాలజీస్ తెలిపింది.









Comments