• Sep 20, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) కోసం ఏఐ-ఆధారిత రక్త పరీక్షను అభివృద్ధి చేయడానికి హెచ్‌సీయూ పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నుంచి రూ.4.98 కోట్ల ఐసీఎంఆర్‌ గ్రాంట్‌ లభించింది. హెచ్‌సీయూలోని స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ బృందం పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ కోసం దేశంలోనే మొట్టమొదటి సింగిల్‌-సెల్‌ ట్రాన్ర్స్కిప్టోమిక్‌ అట్లా్‌సను నిర్మించడంతో పాటు, వ్యక్తిగత సంతాన సాఫల్య సంరక్షణకు తక్కువ-ధర నిర్ధారణ వేదికను రూపొందించనుంది. ఐసీఎంఆర్‌ ఇంటర్మీడియట్‌ ఎక్స్‌ట్రామ్యూరల్‌ గ్రాంట్స్‌-2026 కింద మంజూరైన ఈ కార్యక్రమం, విశ్వవిద్యాలయానికి ఇటీవల అందిన అతిపెద్ద ఎక్స్‌ట్రామ్యూరల్‌ నిధుల పురస్కారాలలో ఒకటిగా నిలుస్తుందని అధికారులు వెల్లడించారు.

    ఆపరేషన్‌ అవసరం లేని రక్తపరీక్ష

    ‘‘నాన్‌-ఇన్వాసివ్‌ పీసీఓఎస్‌ థెరనోస్టిక్స్‌, మాలిక్యులర్‌ ఎండోటైపింగ్‌, ఎర్లీ డిస్కవరీ కోసం సిస్టమిక్‌- ఫోలిక్యులర్‌ సింగిల్‌-సెల్‌ ట్రాన్ర్స్కిప్టోమిక్స్‌ యొక్క మల్టీ-మోడల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేషన్‌’’ అనే పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌, దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తున్న వంధ్యత్వానికి ప్రధాన కారణమైన పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ కోసం,

    అధునాతన జెనోమిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి, శస్త్రచికిత్స అవసరం లేని, సరసమైన రక్తపరీక్షను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల 1న ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపిన అనంతరం, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. దీనికి తొలి సంవత్సరానికిగాను రూ.1.52 కోట్ల ప్రారంభ నిధులు కేటాయించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement