హైదరాబాద్ జంట కమిషనరేట్ల సమావేశంలో కీలక నిర్ణయాలు..
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ వంటి కీలక అంశాల్లో కమిషనరేట్లు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నేరం ఎక్కడ జరిగినా జంట కమిషనరేట్ల పరిధిలో స్పందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు అంతటా ఒకే రూల్ ఉండాలని నిర్ణయించుకున్నారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించుకున్నారు. అలాగే హైదరాబాద్ వచ్చే భారీ వాహనాల నో ఎంట్రీకి ఒకే సమయాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, జంట నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకేసారి చేపట్టాలని, సరిహద్దు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో కమ్యూనికేషన్ సజావుగా ఉండాలని నిర్ణయించుకున్నారు.









Comments