• Sep 20, 2026
  • NPN Log

    గత 24 గంటల్లో సౌదీ అరేబియా తమపై 26 సార్లు దాడి చేసిందని హౌతీలు తెలిపారు. యెమన్‌లోని తమ ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని నిన్న(శుక్రవారం) ప్రకటించారు. గడిచిన వారం రోజుల్లో 300 చోట్ల సౌదీ దాడికి ఒడిగట్టిందని చెప్పారు. కొన్ని రోజులుగా హౌతీలు, సౌదీల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నెలలో యెమెన్‌ రెడ్ సీ తీరంలో ఉన్న బాబ్-అల్-మండేబ్ జలసంధిని హౌతీలు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఆ జలసంధి గుండా సౌదీ నౌకలు తప్ప అన్నిదేశాల నౌకలూ స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని వారు చెబుతున్నారు. జులై నుంచి బాబ్-అల్-మండేబ్ ద్వారా వెళ్లే సౌదీ అరేబియా ఎగుమతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది.

    2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీలు ఆక్రమించుకున్న రోజున అంతర్యుద్ధం చెలరేగింది. 2015లో హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా తమ సైనికులను యుద్ధ రంగంలో దింపింది. ఇది హౌతీ, సౌదీల మధ్య పరస్పర దాడులకు దారితీసింది. 2022లో అక్కడ ఘర్షణ వాతావరణం కాస్త చల్లబడింది. కానీ ఈ ఏడాది జులైలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఈ దాడుల కారణంగా 1,12,000 యెమన్ ప్రజలు నిరాశ్రయులయ్యారని, మరో 3,000 మంది సముద్రం దాటి పారిపోయారని శుక్రవారం ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ) ప్రకటించింది. అలాగే 1.70 కోట్ల మంది యెమన్ ప్రజలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారని 2025లోనే యూఎన్ఓ తెలిపింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement