40 లక్షల మందికి పోలియో చుక్కలు
అమరావతి : ఆరోగ్యశాఖ నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 40 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 54.07 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో తొలి రోజు ఆదివారం 40 లక్షల మంది (74 శాతం) టార్గెట్ పూర్తయింది. సోమవారం, మంగళవారాల్లో మొబైల్ బృందాలు ఇంటింటికి వెళ్లి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్యశాఖ 1,854 మొబైల్ బృందాలను సిద్ధం చేసింది. వీరు ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలను గుర్తించి, వారికి రెండు చుక్కలు వేస్తారు.









Comments