7-8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా?
7-8 గంటలు పడుకున్నా ఉదయాన్నే నీరసంగా, తల భారంగా అనిపిస్తే అది కేవలం నిద్ర సమస్య కాకపోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ D లోపం వల్ల ఎనర్జీ తగ్గి, కండరాల రికవరీ దెబ్బతింటుంది. దీంతో నిరంతరం అలసట, మూడ్ స్వింగ్స్, మెదడు మొద్దుబారడం వంటి సమస్యలొస్తాయి. సరైన ఆహారం, సూర్యరశ్మి, తగినంత నీరు తీసుకోవడంతో పాటు టెస్ట్లు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.









Comments