LPG సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
తెలంగాణ : రాష్ట్రంలో LPG సిలిండర్ల రవాణా సురక్షితంగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీసు ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చమురు సంస్థలతో సమన్వయం చేసుకోనున్నాయి. గోదాములు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కృత్రిమ కొరతను అరికట్టి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ చర్యల వెనక ఉద్దేశంగా కనిపిస్తోంది.









Comments