• Jul 27, 2026
  • NPN Log

    రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. సెక్షన్ కంట్రోలర్ (CEN No. 03/2026) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

    పోస్టుల వివరాలు

    మొత్తం ఖాళీలు: 119

    జోన్ల వారీగా ఖాళీలు:

    రాంచీ – 14, అహ్మదాబాద్ – 11, జమ్మూ & శ్రీనగర్ – 10, చెన్నై – 9, కోల్‌కతా – 8, బెంగళూరు – 8, మాల్దా – 7, భోపాల్ – 6, భువనేశ్వర్ – 6, చండీగఢ్ – 6, ముంబయి – 6, పట్నా – 6, సికింద్రాబాద్ – 5, సిలిగురి – 5, గోరఖ్‌పూర్ – 5, తిరువనంతపురం – 4, ప్రయాగ్‌రాజ్ – 4, బిలాస్‌పూర్ – 4, ముజఫర్‌పూర్ – 3, గువాహటి – 1, అజ్మేర్ – 1

    విద్యార్హత

    గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

    వయోపరిమితి

    2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

    ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు

    ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు

    దివ్యాంగులకు నిబంధనల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

    జీతం

    ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

    దరఖాస్తు ఫీజు

    జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.500 (CBTకు హాజరైతే రూ.400 రీఫండ్)

    ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మాజీ సైనికులు, ఈబీసీ, దివ్యాంగులు – రూ.250 (పరీక్షకు హాజరైతే పూర్తి ఫీజు రీఫండ్)

    ఎంపిక విధానం

    అభ్యర్థుల ఎంపికను నాలుగు దశల్లో నిర్వహిస్తారు.

    కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

    కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్

    సర్టిఫికెట్ వెరిఫికేషన్

    మెడికల్ పరీక్ష

    ముఖ్యమైన తేదీలు

    దరఖాస్తుల ప్రారంభం: జులై 15, 2026

    దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14, 2026

    ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: ఆగస్టు 16, 2026

    దరఖాస్తు సవరణలు: ఆగస్టు 17 నుంచి ఆగస్టు 28, 2026

    స్క్రైబ్ వివరాల సమర్పణ: ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31, 2026

    అర్హులైన అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే అప్లికేషన్ సమర్పించడం మంచిది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement