SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్
RBI రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.









Comments