అత్తింటి వేధింపులు.. రక్షణ శాఖ అధికారిణి ఆత్మహత్య
న్యూఢిల్లీ : ఆమె రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అధికారిణి. కానీ, అత్తింటిలోనే ఆమె ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మూడు నెలల గర్భిణి అయిన ఆమె భర్త, అత్తమామల వేధింపులకు బలైంది. ఆమె ఉరి వేసుకుందని భర్త చెబుతుండగా.. భర్త, అత్తమామలే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు నాజియా ఖాన్(30) రక్షణ శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 11న ఆజమ్ ఖాన్‌తో ఆమె వివాహం జరిగింది. పెళ్లైన వారం నుంచే ఆమెను భర్తతో పాటు అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారని తండ్రి తవాబ్ ఖాన్ ఆరోపించారు.









Comments