• Sep 20, 2026
  • NPN Log

    వాషింగ్టన్‌ : అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎన్నికల తేదీకి దాదాపు 45 రోజుల ముందుగానే ఓటింగ్‌ సందడి మొదలైంది. 20 రాష్ట్రాల్లో ఓటర్లకు మెయిల్‌ ద్వారా బ్యాలెట్‌ పత్రాల పంపిణీ ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాల్లో ఓటర్లు మెయిల్‌ ద్వారా ఓటు వేస్తున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. అమెరికా కాంగ్రె్‌సకు నవంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. మెయిల్‌ ద్వారా ఓటు వేయటాన్ని నియంత్రించాలన్న అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నాలను అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకోవటంతో ఎప్పటిలాగే ప్రజలు మెయిల్‌ ఓటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. కీలకమైన టెక్సాస్‌, మిషిగన్‌, ఉత్తర కరోలినా తదితర రాష్ట్రాల్లో మెయిల్‌ ఓటింగ్‌ మొదలైంది. మిన్నెసోటా, దక్షిణ డకోటా, వర్జీనియా రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఓటింగ్‌ కూడా మొదలైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. నవంబర్‌ 3న పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. ప్రస్తుతం నమోదవుతున్న ఓట్లను కూడా వాటికి కలిపి లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, రష్యాలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఆదివారం వరకు కొనసాగనుంది. ఆక్రమణ ద్వారా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌లోని భూభాగాల్లో కూడా తొలిసారి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.'

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement