ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలో మార్పు
తెలంగాణ : ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. 4న హోలీ పండుగ ఉంటుందని భావించి షెడ్యూల్‌లో 3వ తేదీన పరీక్ష ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితాలో 3న హోలీ పండుగ సెలవు ఉంది. దీంతో ఈ మార్పు చేశారు. అటు ఫిబ్రవరి 2 నుంచి 3 విడతల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.









Comments