• Mar 04, 2026
  • NPN Log

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామంలో కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. బాధితురాలు ఈత ఓదమ్మ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్ తో కలిసి బుధవారం విచారణ నిమిత్తం సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బోరగాల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన ఈత ఓదమ్మ (60) కులం మాల, కాగా ఈనెల 2న గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లగా..అక్కడికి  తనతో పాటు ఉపాధి హామీ పనులకు వచ్చిన లింగంపల్లి సునీత అనునామే తనను ఏందే మాల లంజముండ అంటూ అకారముగా బూతులు తిట్టిందని, అయినప్పటికీ నేను తన జోలికి పోకుండా ఈనెల 3న ఉదయాన గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన విషయాన్ని తెలుపుచుండగా..సదరు సునీత మరియు ఆమె భర్త రాయమల్లు అనువారు మళ్లీ ఏందే మాల లంజముండ అంటూ తనను బూతులు తిడుతూ..నకరాలు చేస్తున్నావు ఏందే మాల లంజముండ అంటూ పలుమార్లు కులం పేరుతో దూషిస్తూ..వారి కాళ్ల చెప్పులతో తనను విపరీతంగా కొడుతూ..తనపై దాడి చేయగా..తను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని, బుధవారం డీఎస్పీ సంపత్ రావుతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేసి బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బోరగాల అశోక్ తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement