ఇరాన్ యుద్ధంలో అమెరికాకు రూ.4.18 లక్షల కోట్ల ఖర్చు
వాషింగ్టన్ : ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా మిలిటరీకి అయిన వ్యయం ఈ నెల 3వ తేదీ నాటికి రూ.4,18,278.78 కోట్లకు(43.6 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన వ్యయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా లెక్కించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఈ వారం అమెరికా చట్టసభల సభ్యులకు అందజేశారు. గత మంగళవారం అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో ఇరాన్ యుద్ధంలో ఆగస్టు 1 నాటికి అమెరికా మిలిటరీకి రూ.3,64,554.9 కోట్ల(38 బిలియన్ డాలర్లు) వ్యయం అయినట్టు పేర్కొన్నారు. అంటే ఈ ఒక్క నెలలోనే రూ.53,723.88 కోట్ల(5.6 బిలియన్ డాలర్లు) ఖర్చు అయ్యింది. ఈ యుద్ధంలో 18 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు.










Comments