• Sep 20, 2026
  • NPN Log

    కోడుమూరు: మండల పరిధిలో సామాజిక భద్రతా పెన్షన్‌కు అర్హత ఉన్న వారు ఈ నెల 16వ తేదీలోపు సమీప గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు ఎంపీడీవో ఏసీ రాముడు సూచించారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు అవసరమైన ధ్రువపత్రాలతో సచివాలయ సిబ్బందిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలన్నారు.దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ప్రమాణాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement