• Sep 20, 2026
  • NPN Log

    హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులకు విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, అత్యుత్తమ శిక్షణ కల్పించే లక్ష్యంతో సాంకేతిక విద్యాశాఖ కీలక అడుగు వేసింది. హైదరాబాద్ పాత ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ‘తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ’  తో సాంకేతిక విద్యాశాఖ అవగాహన ఒప్పందం  కుదుర్చుకుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డా. కే. కేశవరావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

    ఒప్పందంలోని కీలక అంశాలు

    సమగ్ర శిక్షణ: జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్  లో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్  మూడేళ్ల డిప్లొమా ప్రోగ్రామ్ చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు.

    థియరీ, ప్రాక్టికల్స్: విద్యార్థులకు తరగతి గది థియరీతో పాటు ల్యాబ్ ప్రాక్టికల్స్, ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌పై ప్రత్యక్ష ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ కల్పిస్తారు.

    2,100 గంటల ఇండస్ట్రియల్ ట్రైనింగ్: డిప్లొమా చివరి ఏడాదిలో భాగంగా TGSAA లో ఏడాది పాటు దాదాపు 2,100 గంటల నిడివితో ప్రత్యక్ష ప్రాక్టికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశం కల్పిస్తున్నారు.

    భద్రతా ప్రమాణాలు: విమానాల నిర్వహణలో ఏవియేషన్ సేఫ్టీ, సెక్యూరిటీ ప్రమాణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ శిక్షణ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలకు అనుగుణంగా సాగుతుంది.

    ఉపాధి అవకాశాలు: ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్, ఎంఆర్‌ఓ  లు, ఏరోస్పేస్ రంగాంశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది.

    ఐదేళ్ల కాలపరిమితి: సాంకేతిక విద్యాశాఖ - TGSAA మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. 90 శాతం హాజరుతో పాటు ఉత్తమ పనితీరు ప్రమాణాలు కనబరిచిన విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు.

    ఈ చొరవ తెలంగాణలోని యువతకు ఏవియేషన్ రంగంలో నైపుణ్యాలను పెంచి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని, సాంకేతిక విద్య - పరిశ్రమ అనుసంధానానికి ఇది గొప్ప నిదర్శనమని అధికారులు తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement