ఒత్తిడిలో హర్మన్‌సేన
మాంచెస్టర్: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి టీ20 ప్రపంచ కప్‌లో భారత్ అవకాశాలపై గట్టి ప్రభావమే చూపింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హర్మన్ సేన గురువారం జరిగే గ్రూప్ ‘ఎ’ కీలక పోరులో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మిడిలార్డర్ వైఫల్యం, పేలవమైన ఫీల్డింగ్ టీమిండియాను దెబ్బ తీస్తున్నాయి. వాస్తవంగా టాపార్డర్ ఫామ్‌లేమితో భారత్..మెగా టోర్నీలోకి అడుగుపెట్టింది. కానీ మంధాన, షఫాలీ అనుమానాలను పటాపంచలు చేస్తూ జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. అయితే ఈ ఆరంభాలను మిడిలార్డర్ ముందుకు సాగించలేకపోతోంది. ఇదిలావుండగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై భారీ విజయాలతో భారత్ నెట్ రన్‌రేట్ (2.511) బలంగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్ల ద్వారా పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. సఫారీలు కూడా నాలుగు పాయింట్లతో ఉన్నా నెట్రన్ రేట్ (-0.546) కారణంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక..ఆస్ట్రేలియా మొత్తం ఎనిమిది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గ్రూప్‌లో మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకొనే విషయం విదితమే. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్‌తోపాటు చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయాలు సాధిస్తేనే టీమిండియా ముందడుగు వేస్తుంది.









Comments