కేంద్ర సాయుధ బలగాల్లో 438 ఆత్మహత్యలు
కేంద్ర సాయుధ బలగాలు (CAPFs), అస్సాం రైఫిల్స్, NSGలో 2023-25 మధ్య 438మంది సైనికులు సూసైడ్ చేసుకున్నారని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. అత్యధికంగా CRPFలో 159ఆత్మహత్యలు నమోదైనట్లు చెప్పింది. అటు 2014-2025 మధ్య CAPF, అస్సాం రైఫిల్స్‌లో 23,360మంది ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఇందులో BSFలో ఎక్కువ మంది 7,493మంది ఉన్నారంది. ఈ ఏడాది 3,077మంది రిజైన్ చేయగా వారిలో 1,157మంది BSF సైనికులున్నట్లు చెప్పింది.










Comments