కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం ప్రజలను మోసం చేయడమే: మంత్రి ఉత్తమ్
బెంగాల్ ఎన్నికలు ముగిసి 24 గంటలు గడవగానే... కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచి ప్రజలను మోసం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రప్రభుత్వం తన చర్యతో సామాన్యుడిపై పరోక్షంగా పెనుభారం మోపిందన్నారు. ఒక్కసారిగా 30 నుంచి 35 శాతం పెరగడంతో హోటళ్లు, కేఫ్‌లు రెస్టారెంట్లు సహా చిన్నతరహా వీధి వ్యాపారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.









Comments