కళ్లు తాజాగా ఉండాలంటే..
ముఖంలో ఆకర్షణీయంగా ఉండేవి కళ్లే.. కానీ ప్రస్తుతం మారిన జీవన విధానంలో కళ్లు జీవం కోల్పోయినట్లు అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజులో కనీసం నాలుగైదు సార్లైనా కళ్లను చన్నీటితో కడగాలంటున్నారు నిపుణులు. కళ్లకు తరచూ విశ్రాంతినివ్వాలి. సరిపడా నిద్ర లేకపోయినా కంటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు ఏర్పడతాయి. నాణ్యమైన ఐ మేకప్ ఉత్పత్తులు వాడాలి.








Comments