పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?
ఇటీవలి సంవత్సరాలలో మహిళల్లో థైరాయిడ్ సమస్యలు గణనీయంగా పెరిగాయి. థైరాయిడ్ అనేది మెడలో ఉన్న గ్రంథి, ఇది శరీరం అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తించడానికి సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. గర్భం, ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు, జీవనశైలి థైరాయిడ్ అసమతుల్యతకు కారణమవుతాయి. అయితే, పాలిచ్చే మహిళలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా? లేదా ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
థైరాయిడ్ అసమతుల్యత పాలిచ్చే మహిళలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది అలసట, బలహీనత, మానసిక స్థితిలో మార్పులు, పాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో, తల్లి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమె ఆరోగ్యం తన బిడ్డను నేరుగా ప్రభావితం చేస్తుంది.
పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?
తల్లిపాలు ఇచ్చే మహిళలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఈ మందులు సాధారణంగా సురక్షితమైనవని, శిశువుకు ఎటువంటి హాని కలిగించవని చెబుతున్నారు. అయితే, వాటిని వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలి. సూచించిన మోతాదు ప్రకారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా థైరాయిడ్ స్థాయిలను పర్యవేక్షించడం చాలా అవసరం.
జాగ్రత్తలు
వైద్యుడి సలహా లేకుండా మెడిసిన్స్ మార్చవద్దు.
తల్లులు తమ ఆరోగ్యం తోపాటు పిల్లల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.
సమతుల్య ఆహారం, తగినంత నిద్రపై శ్రద్ధ వహించండి.
మీ థైరాయిడ్ స్థాయిలు, హార్మోన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి.
మీరు ఏవైనా అసాధారణ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.







Comments