• Dec 15, 2025
  • NPN Log

    సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారు. వారి ధాటికి ప్రొటీస్ జట్టు 117 పరుగులకే కుప్పకూలింది. ఛేదనకు దిగిన టీమిండియా ఈ టార్గెట్‌ను 15.5 ఓవర్లలోనే ఆటను ముగించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య  అరుదైన రికార్డు సృష్టించాడు.

    అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికాతో ఏడో ఓవర్‌లో స్టబ్స్‌ను ఔట్ చేయడంతో ఈ ఫీట్ సాధించాడు. మరోవైపు 100 వికెట్లు, 100 సిక్సర్లతో పాటు, హార్దిక్ పాండ్యా 2000 పరుగులు పూర్తి చేయడానికి కూడా అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 1,939 పరుగులు చేసిన హార్దిక్, మరో 61 పరుగులు చేస్తే టీ 20ల్లో ఈ మార్కును చేరుకున్న ఐదో భారతీయ ఆటగాడు అవుతాడు. కాగా 100 వికెట్లు తీసుకున్న భారత ఆటగాళ్లలో అర్ష్‌దీప్ సింగ్(108), బుమ్రా(101) ఈ జాబితాలో హార్దిక్‌కు ముందున్న విషయం తెలిసిందే.

     

    ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లు..

    షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 2551 పరుగులు, 149 వికెట్లు

    మహమ్మద్ నబీ(అఫ్టానిస్తాన్)- 2417 పరుగులు, 104 వికెట్లు

    సికిందర్ రజా(జింబాబ్వే)- 2883 పరుగులు, 102 వికెట్లు

    విరణ్‌దీప్ సింగ్(మలేషియా)- 3180 పరుగులు, 109 వికెట్లు

    హార్దిక్ పాండ్య(భారత్)- 1939, 100* వికెట్లు

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement