• Oct 24, 2026
  • NPN Log

    అయిదు కర్పూరం బిళ్లలను తీసుకుని పొడిలా చేసి అందులో కొద్దిగా నిమ్మరసాన్ని రెండు చుక్కల కొబ్బరి నూనె లేదా గులాబీ నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట పలుచగా రాసి అయిదు నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. కర్పూరంలోని ఔషధ గుణాలు హానికారక బ్యాక్టీరియాలను నాశనం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి. నిమ్మరసంలోని సిట్రికామ్లం చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఈ కర్పూరం మిశ్రమంతో మొటిమలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, నల్లమచ్చలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

    కలబంద గుజ్జును అలెర్జీ ఉన్న చోట అప్లయ్‌ చేసి పావు గంట తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే దురద, మంట, వాపు తగ్గుతాయి. కలబంద లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ వ్యాధులను పూర్తిగా నయం చేస్తాయి.

    తులసి లేదా వేపాకులను మెత్తగా నూరి ఆ పేస్టును సమస్య ఉన్న చోట రాస్తే వ్యాధి కారక క్రిములు నశించిపోతాయి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.

    గిన్నెలో రెండు చెంచాల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, రెండు చెంచాల మంచినీటిని వేసి కలిపి అందులో ముంచిన దూదితో అద్దుతుంటే క్రమంగా చర్మ సమస్యలు తీరుతాయి.

    రెండు మూడు ఐస్‌ క్యూబ్స్‌ను పలుచని రుమాలులో చుట్టి దానితో అద్దుతుంటే మొటిమలు, ఇతర అలెర్జీల కారణంగా వచ్చే నొప్పి, వాపు తగ్గుతాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement