• Sep 20, 2026
  • NPN Log

    యూఎస్‌కు చెందని డ్రోన్ తయారీ సంస్థ పవర్‌అజ్‌తో డ్రోన్ సరఫరా కోసం పాక్‌ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ తాజాగా అంతర్జాతీయ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. బుధవారం ఆయన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయులు ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లకు వాటాలున్న ఆరియస్ గ్రీన్‌వే హోల్డింగ్స్ అనే సంస్థలో పవర్‌అజ్ త్వరలో విలీనం కానున్న నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, ఎన్ని డ్రోన్స్‌ను సరఫరా చేస్తారు? డీల్ విలువ ఎంత? అనే వివరాలను మాత్రం వెలికోవిచ్ వెల్లడించలేదు. పాక్‌తో కలిసి సంయుక్తంగా ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెలికోవిచ్ తెలిపారు. పాక్‌లో ప్రైవేటు డిఫెన్స్ సంస్థలు ఇంకా శైశవ దశలో ఉన్నందుకు తమ లాంటి సంస్థల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇక పాక్‌లో డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కూడా వెలికోవిచ్ తెలిపారు.

    ఈ డీల్ వెనుక ట్రంప్ కుటుంబం ఇన్‌ఫ్లుయెన్స్ ఉందన్న వాదనలను సంస్థ సీఈఓ ఫాక్స్ కొట్టిపారేశారు. కేవలం తమ ప్రతిభ, గుర్తింపు ఆధారంగా పాక్ నుంచి ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నామని చెప్పారు. తమ కంపెనీ రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణలో ట్రంప్ తనయులు పాలుపంచుకోరని స్పష్టం చేశారు.

    అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, అమెరికన్ వెంచర్స్ అనే ఇన్వెస్ట్‌మండ్ ఫండ్ ద్వారా ట్రంప్ సోదరులు ఆరియస్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఆరియస్, పవర్‌అజ్ విలీనం తరువాత సంస్థలో ట్రంప్ సోదరుల వాటా 9.9 శాతంగా ఉంటుందని సమాచారం.

    ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ప్రతినిధి స్పందించారు. ట్రంప్ జూనియర్ కేవలం పెట్టుబడిదారుగా మాత్రమే ఉన్నారని అన్నారు. కంపెనీ నిర్వహణ, కాంట్రాక్ట్‌లు వంటి విషయాలతో ఆయనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై ఎరిక్ ట్రంప్ ఇంకా స్పందించాల్సి ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement