డాక్టర్ రామసుబ్బయ్య మృతి వైద్య రంగానికి తీరనిలోటు
అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యవస్థాపనలో ప్రముఖ పాత్ర పోషించిన రామసుబ్బయ్య మరణించడం అత్యంత విచారకరం. వైద్యం పట్ల, పేదల పట్ల స్పష్టమైన అవగాహన, అంకితభావం కలిగిన ఇలాంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారు.
వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, అప్పుడే అది సామాన్యులందరికీ అందుబాటులో ఉంటుందని రామసుబ్బయ్య బలంగా నమ్మారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో పేద ప్రజల ఆదాయం వైద్యం కోసమే సరిపోతోందని గుర్తించి, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా జోలి పట్టుకుని మరీ నిధులు సమీకరించిన గొప్ప వ్యక్తి ఆయన.
ఆనాడు ఆ కార్యశ్రమాల్లో భాగస్వామిగా ఉన్న నాకు, రామసుబ్బయ్య ఔన్నత్యం గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన మరణం వైద్య రంగానికే కాకుండా, పేద ప్రజలకు కూడా తీరని లోటు. రామసుబ్బయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు









Comments