నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్’ రైలు పొడిగింపు
చెన్నై: చెన్నై సెంట్రల్-విజయవాడ మధ్య నడుపుతున్న వందే భారత్ రైళ్లను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరకు తాత్కాలికంగా పొడిగించారు. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... నెం.20677 చెన్నై సెంట్రల్-నరసాపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 15 నుంచి జనవరి 11వ తేది వరకు చెన్నై సెంట్రల్‌లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి 7.05 గంటలకు రేణిగుంట, 8.29 గంటలకు నెల్లూరు, 9.43 గంటలకు ఒంగోలు, 11.08 గంటలకు విజయవాడ , మధ్యాహ్నం 12.29 గుడివాడ, 1.14 గంటలకు భీమవరం టౌన్, 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
మరుమార్గంలో, నెం.20678 నరసాపురం-చెన్నై సెంట్రల్ వందే భారత్ ఈ నెల 17 నుంచి జనవరి 11వ తేది వరకు నరసాపురం లో మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి 3.19 గంటలకు భీమవరం టౌన్, సాయంత్రం 4.04 గంటలకు గుడివాడ, 4.50 గంటలకు విజయవాడ, 6.29 గంటలకు ఒంగోలు, రాత్రి 7.39 గంటలకు నెల్లూరు, 9.50 గంటలకు రేణిగుంట, 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని దక్షిణ రైల్వే తెలిపింది.








Comments