నలుగురు క్రికెటర్లు సస్పెండ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో క్రికెటర్లు అమిత్, అహ్మద్, అమన్, అభిషేక్‌ను అస్సాం క్రికెట్ అసోసియేషన్(ACA) సస్పెండ్ చేసింది. ఆపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR నమోదైంది. విచారణ పూర్తయ్యే వరకూ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని వారిని ఆదేశించింది. వీళ్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో ప్లేయర్లను ప్రభావితం చేసి అవినీతికి ప్రేరేపించినట్లు ఆరోపణలున్నాయి. అటు అస్సాం జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ దశకు చేరలేదు.










Comments