• Sep 20, 2026
  • NPN Log


    కోడుమూరులో పేద మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ.ఆర్. ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ ఎస్తేరు రాణి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన పేద మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.
    ఈ సందర్భంగా ఎస్తేరు రాణి మాట్లాడుతూ, మహిళలు ఇంటి వద్దే దుస్తులు కుట్టుకుంటూ ఆదాయం పొందే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కుటుంబ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, స్వయం ఉపాధి ద్వారా వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.విశాఖపట్నం నుంచి కోడుమూరుకు వచ్చి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. అవసరమైన వారికి సహాయం అందిస్తూ భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో షారోన్, మునీంద్ర, సుదీర్‌బాబు, వెంకటేశ్వర్లు, సాల్మన్ రాజు, జీవన్ జ్యోతి తదితరులు   పాల్గొన్నారు..

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement