పిల్లలకు న్యుమోనియా ఉందా?
శీతాకాలంలో పిల్లలు న్యుమోనియా ప్రమాదం ఎక్కువ. అధిక జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఆక్సిజన్ తగ్గితే చర్మం, పెదవులు నీలం రంగులోకి మారతాయి. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. న్యుమోనియా ఉన్న పిల్లల గదిని శుభ్రంగా, వెచ్చగా ఉంచడం, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, సూప్ ఇవ్వాలని సూచిస్తున్నారు.









Comments